తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Tuesday, July 2, 2013

ఓ పలకరింపు టపా

ఈ బ్లాగు ద్వారా చాలామంది పాఠకలు మిత్రులయ్యారు. అందరూ ఇప్పటికీ మిత్రులే, పాఠకులవునో కాదో మాత్రం తెలియదు. :-) ఇంకా పాఠకులే అయిన మిత్రుల కోసం, మిత్రులు కాని పాఠకుల కోసం కూడా, బ్లాగు మూసెయ్య లేదన్న సూచనగా, ఒక చిన్న పలకరింపు టపా యిది, అంతే. పనిలో పనిగా కొంత సొంత ప్రోపగాండా కూడా చేసుకుందామని.

సుజనరంజని పత్రికలో "పద్యాలలో నవరసాలు" అనే శీర్షికతో ఒక వ్యాసపరంపర వ్రాస్తున్నాను, ఆరు నెలలుగా. అందులో యీ నెల బీభత్స రసాన్ని గురించిన వ్యాసం ఇక్కడ చదవుకోవచ్చు:

http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/july13/padyam-hrudyam.html

ఈమాట పత్రికలో వస్తూ ఉన్న "నాకు నచ్చిన పద్యం" శీర్షికని యీ నెలనుంచీ నేను కొనసాగిస్తున్నాను. ఈ నెల వ్యాసం ఇక్కడ:

http://www.eemaata.com/em/issues/201307/2116.html

(నేను బ్లాగుకి దూరమవ్వడానికి అసలు కారణం ఇప్పుడర్థమయ్యిందా! అంచేత దీనికి బాధ్యులు ఆయా పత్రికల సంపాదకులే తప్ప నేను కాదు. :))

ఎంత పలకరింపు టపా అయినా, ఒక్క పద్యంకూడా లేకపోతే ఎలా? అందుకోండి ఒక పద్యం. ఈ పద్యం వ్రాసిన కవి ఎవరో కనుక్కోండి చూద్దాం!

నెట్టిన ప్రతి గుమ్మంలో
మెట్టిన ప్రతి గడపలోన మేమేం చూశాం?
పుట్టల చెదపట్టిన తు
ప్పట్టిన భావాల బీరువాలు, అనేకం!

తెలియలేదా? పోనీ మరొక్క పద్యం కూడా ఆ కవిదే చూడండి:

నేటి తెలుగుసాహిత్య వాణిజ్యవీథి
కేవల నిరక్షరాస్యులు కృతకవేత్త
లెంత పెత్తనమ్మును చలాయింపగలరొ
నాడెపుడయిన తలపోసినామ మనము?

ఎప్పుడైనా వీలూ, 'విల్లూ' కుదిరినప్పుడు, యీ కవి గురించి కొంచెం వివరంగా టపాయిస్తాను.

11 comments:

  1. sir your vaakyanam regarding telugu saahityam too good ,amma vadilo padukunte nidra ala haayiga padutundo mee vaakyanam kuda antha haayiga maa lanti pamarulanu saitham sahitya mattuloki dinchutundi guruvu garu.
    kindly give vaakyanam on ALLASAANI PEDDANA urttamalika in your style sir Ple................

    ReplyDelete
  2. This reminds me of a poem from విశ్వనాథ పంచశతి


    విపుల తరమైన భాషా

    నిపుణత లేకయ విమర్శ నెగడించు నహో!

    కపురమ్ము, పునుగు, నత్తరు

    నపుంసకుడు (గుర్తు రావటం లేదు). నలుదిక్కులకున్

    ReplyDelete
  3. కవిమితృలకు అభివందనములు. మీ కవిత్వము చాలా బాగుంది. మంచి కవిమిత్రులు దొరికినందులకు మిక్కిలి సంతోషముగా ఉంది.

    ReplyDelete
  4. బాగానే ఉంది గాని, ఈ "eng sara" గారు తరచూ ఈ బ్లాగ్లో వేరే భాషలో వ్రాస్తున్నది ఏమిటో బోధపడట్లేదు. ఇది తెలుగు బ్లాగ్ కాబట్టి, వీరు చెప్పదల్చుకున్నది తెలుగులో కాకపోతే కనీసం ఇంగ్లీష్లోనైనా వ్రాస్తే అత్యధిక తెలుగు బ్లాగ్ చదువరులకు సులభంగా ఉంటుంది గదా.

    ReplyDelete
  5. అదేదో ప్రకటనలో లాగా ఆ వేరే భాష కామెంట్స్ "అరే, పోయిందే".

    ReplyDelete
  6. మీ కామెంటు చూసి ఇప్పుడే వాటన్నిటినీ తుడిచిపెట్టానండీ! :)

    ReplyDelete
  7. Hello sir,

    Vishwanadha vari ramayanaM lo "Sundara kanda" part soft copy ekkaDainaa dorukutuMdaa?
    "Digital lib of India'" lO anni kAMDalU unnAyi kAnee, sundara kAMDa mAtraM LEdu...

    Regards
    Nanduri

    ReplyDelete
  8. మీ బ్లాగుకి అప్పుడప్పుడు విదేశీ భాషల "పలకరింపు" తప్పట్లేదులా ఉందే.

    ReplyDelete
  9. మా బోటి పామరులకై మామూలు తెలుగు భాష లో రాయండీ!

    ReplyDelete
  10. మా బోటి పామరులకై మామూలు తెలుగు భాష లో రాయండీ!

    ReplyDelete